జర్నలిస్ట్స్ హౌసింగ్ కాలనీలో టిటిడి ఆలయం
విజయనగరం. ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కన జర్నలిస్స్ట్ హౌసింగ్ కాలనీలో టిటిడి నిధులతో నిర్మాణం కానున్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ కర్రోతు రాధామణి శంకుస్థాపన పూజలు జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో శ్రీశ్రీశ్రీ విజయ వర సిద్ధి వెంకటేశ్వరస్వామి వారి ఆలయం జర్నలిస్ట్స్ కాలనీలో నిర్మాణం కావటం అదృష్టమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. బోరు బావిని జిల్లా పరిషత్ ఛైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు, కాలువని ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ మంజూరు చేశారని, మరిన్ని ఇళ్ల నిర్మాణాలు జరిగిన తరువాత పలు మౌళిక వసతులు కల్పిస్తామని కోలగట్ల హామీ ఇచ్చారు. మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ రాధామణి, లోక్ సత్తా రాష్ర్ట అధ్యక్షులు భీశెట్టి బాబ్జి, పలువురు వైసిపి, టిడిపి నాయకులు జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత సీనియర్ జర్నలిస్ట్ కళ్యాణ్ రామ్ దంపతులు శంకుస్థాపన అర్చన జరిపారు. అతిధులను అధ్యక్షులు బూరాడ శ్రీనివాసరావు కృతజ్ఙతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంకి కోలగట్ల వీరభద్రస్వామి లక్ష రూపాయిలు, సీనియర్ జర్నలిస్టులు బూరాడ శ్రీనివాసరావు యాభై వేల రూపాయిలు, ఆర్.సి.ఎం. చౌదరి పాతిక వేల రూపాయిలు, బి.రామకృష్ణ ఇరవై వేల రూపాయిలు, మజ్జి వాసు పది వేల రూపాయిలు, కళ్యాణరామ్ పది వేల రూపాయిలు, దేవ త్రినాధ్ ఐదు వేల రూపాయిలు ఆర్ధిక సహకారం ప్రకటించారు.
అతిధులను బూ.శ్రీ, మజ్జి వాసు, భళ్లమూడి నాగేంద్రప్రసాద్ , కె.శేఖర్, రమేష్ నాయుడు, ఎం.ఎం.ఎల్ .నాయుడు, మహాపాత్రో, సి.ఎన్.బాబు, బి.రామకృష్ణ, ఆర్.సి.ఎం.చౌదరి, మానాపురం రవిచంద్రశేఖర్, కె.జె.ఆర్ శర్మ, జి.వి.ఎస్.ఆర్ మూర్తి, కాళ్ల శ్రీనివాసరావు, జె.శ్రీనివాసరావు, చందక దుర్గాప్రసాద్, జోగారావు, దాలిరాజు, గౌరీశంకర్, లింగాల నరసింగరావు, అప్పారావు, రాజేంద్రప్రసాద్ (బాబా), ఆదినారాయణ, బుజ్జిబాబు, బంగారునాయుడు, దేవ త్రినాధ్ , కామేష్ , చందక మధు, వెంకటరావు, శాంతమూర్తి, భాస్కర్, శివాజి, మజ్జి శివ, గురుప్రసాద్ తదితరులు సత్కరించారు.
*రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులను ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ* *చుట్టుప్రక్కల జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డి గ్యాంగ్ ముఠా పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళి కృష్ణ *బయట ఊర్లకు వెళ్తున్నారా! స్థానిక పోలీసులకు తెలియజేయండి* *నగదు, విలువైన అభరణాలు బ్యాంక్ లాకర్లో దాచుకోవాలి: జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,* *అనకాపల్లి, నవంబర్ 15:* ప్రజలను దొంగతనాల పట్ల అప్రమత్తం చేసేందుకు మరియు చెడ్డి గ్యాంగ్ ముఠా, ఇతర […]
వన్డే ప్రపంచకప్ 2023 భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. మరోసారి చెమట పట్టకుండా విజయాన్ని అందుకుంది. లక్నో వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన పోరులో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. భారత్ నిర్దేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక డిఫెండింగ్ చాంపియన్ చతికిల పడింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 4 వికెట్లతో మరో పక్క బుమ్రా కూడా 3 వికెట్లతో హడలెత్తించారు. కుల్దీప్ […]